Gunna Maamidi

ఆఆఆఆ ఆఆఆఆఆ
గున్న మామిడీ కొమ్మమీద
గూళ్లు రెండున్నాయి
గున్న మామిడీ కొమ్మమీద
గూళ్లు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోనా కోయిలుంది
గున్న మామిడీ కొమ్మమీద
గూళ్లు రెండున్నాయయి
చిలకేమో పచ్చనిది కోయిలేమొ నల్లనిది
ఐనా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
ఆ చిలకేమో పచ్చనిది కోయిలేమొ నల్లనిది
ఐనా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే
ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే
ముద్దుముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మఊయలా ఆ

(హోయ్ గున్న మామిడీ కొమ్మమీద)
(గూళ్లు రెండున్నాయి)
ఒక గూటిలోన రామచిలకుంది
ఒక గూటిలోనా కోయిలుంది
(గున్న మామిడీ కొమ్మమీద)
(గూళ్లు రెండున్నాయి)
ఆ ఒక పలుకే పలుకుతాయ్
ఒక జట్టుగ తిరుగుతాయ్
ఎండైన వానైనా ఏకంగా ఎగురుతాయ్
ఆ ఒక పలుకే పలుకుతాయ్
ఒక జట్టుగ తిరుగుతాయ్
ఎండైన వానైనా ఏకంగా ఎగురుతాయ్
రంగూ రూపూ వేరైనా
జాతీ రీతీ ఏదైనా
(రంగూ రూపూ వేరైనా)
(తమ జాతీ రీతీ ఏదైనా)
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి

(హోయ్ గున్న మామిడీ కొమ్మమీద)
(గూళ్లు రెండున్నాయి)
ఒక గూటిలోన రామచిలుకుంది
ఒక గూటిలోనా కోయిలుంది
(గున్న మామిడీ కొమ్మమీద)
(గూళ్ళు రెండున్నాయి)

(గున్న మామిడీ కొమ్మమీద)
(గూళ్లు రెండున్నాయి)
(గున్న మామిడీ కొమ్మమీద)
(గూళ్లు రెండున్నాయి)
(గున్న మామిడీ కొమ్మమీద)
(గూళ్లు రెండున్నాయి)



Credits
Writer(s): Sathyam, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link