Kurisenu Hrudayamio

కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు
కురిసెను కన్నులలో పూలవానలు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు
కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు

పగలే వెన్నెల మయము ఈ జగమే నందన వనము
నా తలపులు పండే వలపులు నిండే మోజులే రేపే నాలో
మనసే ప్రేమాలయము అతి సుందర బృందావనము
తొలి చూపుల నెలము కలిసెను మనము ఆశలు రేగే నాలో
ఓ ప్రియా ఆ ఆఆ
కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు

పెదవులలో మధురిమలు నీ నడకలలో మగసిరులు
అనురాగములొలికే తీయని పలుకే విందులు చేసె నాలో
కన్నులలో నయగారం నీ నడకలలో వయ్యారం
ఆ నగవుల సొగసే రమ్మని పిలిచే తొందర చేసె నాలో
ఓ చెలి ఈ ఈ ఈ
కురిసెను కన్నులలో పూలవానలు
విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు



Credits
Writer(s): Sathyam, Ankisri
Lyrics powered by www.musixmatch.com

Link