Sudigalidhira

సుడిగాలిదిరా ఎగిరి దూకేటి చిరుతపులిరా
ఎదురే లేదురా, నువ్వు గురి చూసి వేటు వెయ్యరా

సుడిగాలిదిరా ఎగిరి దూకేటి చిరుతపులిరా
ఎదురే లేదురా, నువ్వు గురి చూసి వేటు వెయ్యరా
పోరుకు దువ్వింది సత్తువున్న కాలు
సింగం వచ్చింది విదిలించి జూలు
కత్తులతో ఆడుకునే రాయలసీమరా
ఈ నెత్తురులో సాటిలేని పౌరుషం ఉందిరా
(నిలిచి గెలిచే రాయుడు)
(దమ్ములున్న మగాడు)
(నిలిచి గెలిచే రాయుడు)
(దమ్ములున్న మగాడు)
సుడిగాలిదిరా ఎగిరి దూకేటి చిరుతపులిరా
ఎదురే లేదురా, నువ్వు గురి చూసి వేటు వెయ్యరా

దిగితే బరిలో మేం దుమ్ము దులిపేస్తాం
ధైర్యంగా అడుగు ముందుకెయ్యి వెయ్యి
మూటలు మోస్తున్నా ఎపుడూ బరువనుకోం
తేలిగ్గా మనసు ఉంది కలిపేయ్ చెయ్యి
కాయలు కాచెనమ్మా, చేతుల్లోన రేకల్లేవు
అయినా ఏ దిగులు లేదు
రోజూ నెత్తిన మేం పూసుకునే మట్టి కన్నా
విబూది గొప్పేం కాదు
తల మీద బరువుల్ని ఎత్తుకుంటాం
కానీ తలలోన గర్వాన్ని ఎత్తుకోము
(నిలిచి గెలిచే రాయుడు)
(దమ్ములున్న మగాడు)
(నిలిచి గెలిచే రాయుడు)
(దమ్ములున్న మగాడు)
సుడిగాలిదిరా ఎగిరి దూకేటి చిరుతపులిరా
ఎదురే లేదురా, నువ్వు గురి చూసి వేటు వెయ్యరా
(ఒంగోలు గిత్త వీడు చూపుతాడు సత్తా)
(గొడవకొచ్చినోడు ఇక ఉండడంట పత్తా)
(మరుమల్లె పూవల్లె నవ్వుతాడు వీడు)
(మన్మధుడి బాణాలే రువ్వుతాడు చూడు)
(ఎదిగినా ఒదిగుండే మనసులే)
(ఎదిరిస్తే తల ఎత్తే వయసులే)

Shirt అంతా నలిగింది, కాస్తంత చిరిగింది
అయినా ఈ కంటి చూపు కత్తి కత్తి
చమట వెలుతురుతో చీకట్లు తరిమేస్తూ
మదిలోన ప్రేమ పూల గుత్తి గుత్తి
ఊరికే ఆకతాయి పని చేసే తింగరోళ్ళ కాళ్ళ కింద నలిపేస్తాం
ఆడపిల్లల్ని ఎంటబడి ఏడిపించే పోకిరోళ్ళ పనిబడతాం
కనిపెంచే అమ్మే మా దైవం అంటాం
ఆమెని కాపాడే దేవుడికి పూజే చేస్తాం
(నిలిచి గెలిచే రాయుడు)
(దమ్ములున్న మగాడు)
(నిలిచి గెలిచే రాయుడు)
(దమ్ములున్న మగాడు)
(నిలిచి గెలిచే రాయుడు రాయుడు రాయుడు)
(దమ్ములున్న మగాడు మగాడు మగాడు)
(నిలిచి గెలిచే రాయుడు)
(దమ్ములున్న మగాడు)
సుడిగాలిదిరా



Credits
Writer(s): Vennelakanti Subbu Rajeswara Prasad, D. Imman
Lyrics powered by www.musixmatch.com

Link