Kanne Veede

కన్నే వీడే కలగా మారి జారిపోయే
చెలి కన్నీరై, చెలి కన్నీరై
వాన విల్లై, తేనే జల్లై, నాకై వచ్చే
చెలి కన్నీరై, చెలి కన్నీరై
పలుకై నాడు, మునుపై నేడు
ఎదలో నిలిచే మగువ
జతగా నాడు, చితిగా నేడు
సగమై రగిలే పగవా

నిన్ను నన్ను కలిపిందెవరో తెలుసా నీకు
నీ తొలిచూపు నా మలిచూపు
నీలో నాలో ఉన్నది ఏంటో తెలుసా నీకు
నీ మది నాలో, నా మది నీలో
చెలియా చెలియా హృదయం నీదే
ఉరికే వయసే ఎగసే
పొంగే పొంగే కలలే అలగా
తీరం దాటి నిను చేరినానే

జత కలసిన నువ్వే నేను
శృతి లయలో నేనే నువ్వు
నాకై పుట్టిన నా ప్రాణమై నన్నే కలిశావే
నా మనసే నీలో కన్నా
నా శ్వాసే నీవనుకున్నా
నా కావ్యాన నాయికగా వెలిశావే
మదిలో దాచిన నా వలపునే చంపేశావే
తీపై వచ్చి నా జీవితాన చేదైనావే
కల కరిగే కొద్దీ ఆ విధి రాత
ఎప్పుడు మారును ఈ ఎదురీత

కన్నే వీడే కలగా మారి జారిపోయే
వాన విల్లై, తేనే జల్లై, నాకై వచ్చే
పలుకై నాడు, మునుపై నేడు
ఎదలో నిలిచే మగువ
జతగా నాడు, చితిగా నేడు
సగమై రగిలే పగవా మగువ

(కన్నే వీడే కలగా మారి జారిపోయే)
(కన్నే వీడే కలగా మారి జారిపోయే)
(వాన విల్లై, తేనే జల్లై, నాకై వచ్చే)
(కన్నే వీడే కలగా మారి జారిపోయే)
(వాన విల్లై, తేనే జల్లై, నాకై వచ్చే)
(కన్నే వీడే కలగా మారి)



Credits
Writer(s): Jayaraj J Harris, Prasad Vennelakanti Subbu Rajeswara
Lyrics powered by www.musixmatch.com

Link