Idhera (From "Yevade Subramanyam")

ఓ మనిషి
ఓ మహర్షి
కనిపించిందా ఉదయం?
ఓ మనిషి
ఓ అన్వేషి
వెలుగయ్యిందా హృదయం?

ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంత మటుమాయమైనది
ఈ ప్రాణం ఈ రోజే మరలా ఊపిరిపొంది
తానవెరో కనుగొన్నది
ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

వదలనిదే నీ స్వార్ధం,కనబడునా పరమార్ధం?
మనసులను గెలిచేది ప్రేమే కధా?
ప్రేమే మానవత్వం ప్రేమే దైవతత్వం
జీవించేటి దారే ఇది
ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

ఎదసడిలో నిజముంది కనుతడిలో నిజముంది
అడుగడుగు గుడి ఉంది ప్రతీ మనిషిలో
నివేధించు ప్రాణం దైవంతో ప్రయాణం
సాగిస్తుంది నీ జీవితం
ఇదేరా ఇదేరా గెలుపంటే ఇదేరా
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా

ఓ మనిషి
ఓ మహర్షి
కనిపించిందా ఉదయం
ఓ మనిషి
ఓ అన్వేషి
వెలుగయ్యిందా హృదయం?



Credits
Writer(s): Ramajogayya Sastry, Radhan
Lyrics powered by www.musixmatch.com

Link