Devude Ichchadu (From "Anthuleni Katha")

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా
ఇక ఊరేలా సొంత ఇల్లేలా ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

నన్నడిగి తలిదండ్రి కన్నారా
నన్నడిగి తలిదండ్రి కన్నారా నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాదికాదే పోవే పిచ్చమ్మా
నారుపోసి నీరుపోసే నాధుడువాడమ్మా
ఏదినీది ఏదినాది ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల ఈ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా
కళ్ళులేని కబోది చేతి దీపం నువ్వమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మణిక్యాన్ని వెదికే వెర్రమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి



Credits
Writer(s): Athreya, M. S. Viswanathan
Lyrics powered by www.musixmatch.com

Link