Ooh Andi Pilla

ఊ అంది పిల్లా అల్లో మల్లేశా
తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా
వేవేల ఆశలతో వస్తుంది పూబాల
మెల్లోన మురిపెంగా వేస్తుంది వరమాల
హో ఊ అంది పిల్లా అల్లో మల్లాశా
తెల్లారేకల్లా పెళ్ళే పరమేశా

ఎల్లోరా శిల్పమల్లే నువ్వు కూర్చంటే
నిండుగా నేను చూస్తుంటే
ఉప్పొంగే ఊహలేవో వెన్ను తడుతుంటే
ఎదే బరువెక్కిపోతుంటే
శుభమంత్రాలే వినబడుతుంటే
పచ్చని తాళి నువ్వు కడుతుంటే
ఎన్నెన్నో జన్మల బంధం
నిన్ను నన్ను ఏకం చేస్తుంటే
ఊ అంది పిల్లా అల్లో మల్లాశా
ఓ నీ నీడ నేనై ఉంటా పరమేశా

క్రీగంటి చూపుతో నే సైగ చేస్తుంటే
నువ్వేమో సిగ్గు పడుతుంటే
నాపైన వెచ్చగా నువ్వు వాలిపోతుంటే
ఒల్లంతా కాలిపోతుంటే
మల్లేల మంచం ఒనికేస్తుంటే
వెన్నెల రేయి వరదౌతుంటే
తమకంతో జారే పైట
రారమ్మంటూ కవ్విచేస్తుంటే

ఊ అంది పిల్లా అల్లో మల్లాశా
ఓ పరువాల దాహం తీర్చేయ్ పరమేశా
కవ్వించే అందాలు కల్లార చూడాల
కౌగిల్ల జాతరలో తెల్లారిపోవాల
ఊ అంది పిల్లా అల్లో మల్లాశా
లాలాల లాలా లాలా లాలా



Credits
Writer(s): Koti, Siri Vennela Seetha Ramasasthry
Lyrics powered by www.musixmatch.com

Link