Kanneellaki

కన్నీళ్ళకే కన్నీరొచ్చే
కష్టాలకే కష్టం వేసే
కన్నా ఇలా నిన్నే చూడగా
అన్ని నువ్వై భారం మోయగా
నీ బరువెే నీ చదువై
ఎదిగిన పసికూన
కన్నీళ్ళకే కన్నీరొచ్చే
కష్టాలకే కష్టం వేసే
కన్నా ఇలా నిన్నే చూడగా
అన్నీ నువ్వై భారం మోయగా

అమ్మలోని లాలన
నాన్నలోని పాలన
అంది పుచ్చుకున్న ఈ అన్న నీడలో
కొమ్మ చాటు పూవ్వునై
కంచె చాటు పైరులై
చిన్ని పాపలందరు ఎదుగు వేళలో
ముసిరే నిశిలో నడిచే దిశలో
నెత్తురుతో నిలిపావె ఆరని దీపాన్ని
కన్నీళ్ళకే కన్నీరొచ్చే
కష్టాలకే కష్టం వేసే
కన్నా ఇలా నిన్నే చూడగా

అన్నీ నువ్వై భారం మోయగా

దారి చూపు సూర్యుడా
జోల పాడు చంద్రుడా
నీవు కంట నీరు పెడితే నిలువ లేమురా
మీరు కాదె అమ్మలు
తీరుతున్న ఆశలు
ఇన్నినాళ్ళ భారమంతా కడుగుతున్నవే
ఒడిలో ఒదిగే రుణమై ఎదిగే
మరుజన్మానికి నిను కని పెంచే అమ్మవుతామయ్య
మీ నవ్వే వెన్నల వెలుగమ్మ
నా ఎదలో కాంతుల కోలువమ్మ
ఏ దైవమొ దీవించాడు
మా అన్నగా దిగి వచ్చాడు
ఏ జన్మలొ రుణము తీర్చగా
మా కోసమే ప్రాణం పంచగా
ఏ పుణ్యం మా కోసం జీవనమిచ్చిందో
మీ నవ్వే వెన్నల వెలుగమ్మ
నా ఎదలో కాంతుల కోలువమ్మా



Credits
Writer(s): Veturi Sundararama Murthy, Koti
Lyrics powered by www.musixmatch.com

Link