Malli Malli (From "Rakshasudu")

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నాకు వెన్నెలేది
ఏదో అడగాలని
ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు

చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావ గీతం
ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో
ఒక్కరం ఇద్దరం అవుతున్నాం
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్న తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు

కళ్ళనిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఏ మొగ్గే పూయని
రాగాలే బుగ్గల్లో దాయని
గులాబీలు పూయిస్తున్నా తేనెటీగ అతిధేది
సంధేమబ్బులున్నోస్తున్నా స్వాతి చినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగ

జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నీకు వెన్నెలేది
ఏదో అడగాలని
ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమి కాను

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు



Credits
Writer(s): Sirivennela Seetha Rama Shastry, M.m. Sreelekha
Lyrics powered by www.musixmatch.com

Link