Epudo Paadindhi

ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట...
అందులో దాగుంది నీ బ్రతుకు బాట...
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట...
అందులో దాగుంది నీ బ్రతుకు బాట...
కొల్కిరా జీవితాన హాయనీ...
లోకంలో బంధాలే మాయనీ...

ఊయలలో ఊపింది ఉగిసలాడే బ్రతుకనీ...
వీపున కొట్టింది ముందు చూపు ఉండాలనీ...
చందమామ వస్తాడని తహ తహలే రేపింది...
రాయిలాంటి సంగంలో గుండె గట్టి పరచాలని...
అమ్మ వేదం అర్థమాయే...
ఉన్న బ్రమలే తొలగి పోయే...
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట...
అందులో దాగుంది నీ బ్రతుకు బాట...

లాలపోసి మసి బొగ్గును నుదిట మీద పూసిందీ...
పాడు దిస్టి నీ మీద పడుతుంది అని కాదు...
చల్లనైన తల్లిలోన తత్వం ఒకటి దాగుంది...
మనిషికింక తుది మజిలీ మరు భూమి మసియేనని...
వచ్చి పోయే... జన్మలైన చచ్చి పోనీ... ఆశ నాది...
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట...
అందులో దాగుంది నీ బ్రతుకు బాట...
ఎప్పుడో పాడింది అమ్మ జోల పాట...
అందులో దాగుంది నీ బ్రతుకు బాట...
కొల్కిరా జీవితాన హాయనీ...
లోకంలో బంధాలే మాయనీ...



Credits
Writer(s): S.a.raj Kumar, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link