Surajya Manaleni

సురాజ్యమనలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలికోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో
ఎగిరే భరత పతాకం
ఆవేశంలో ప్రతినిమిషం
ఉరికే నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున
బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల
యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి
సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో
ఎగిరే భరత పతాకం
చెరుగుతుంది ఆ తల్లి చరితలో
విశ్వ విజయాల విభవం

సురాజ్యమనలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
కులమతాల దవానలానికి కరుగుతున్నది
మంచు శిఖరం
కలహముల హాలా హాలానికి
మరుగుతున్నది హిందుసంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచెను
నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన
రాచకురుపీ రాజకీయం

విషము చిమ్మెను జాతి తనువున
ఈ వికృత గాయం



Credits
Writer(s): Siri Vennela Seetha Ramasasthry, Sri
Lyrics powered by www.musixmatch.com

Link