Malle Puvvu

మల్లె పువ్వు గిల్లింది
తెల్ల చీర నవ్వింది
పైట జారి పోయింది
పాలపిట్ట కూసింది
మల్లె పువ్వు గిల్లింది
తెల్ల చీర నవ్వింది
పైట జారి పోయింది
పాలపిట్ట కూసింది
పట్టె మంచం కిర్రుమన్నదిరో చల్ మోహన రంగ
నీకు నాకు జోడు కుదిరెను పదరా
చల్ మోహన రంగ నీకు నాకు జోడు కుదిరెను పదరా

గాలికైనా సందులేని కౌగిలింతల్లో... కౌగిలింతల్లో
పూలు కూడా అత్తరయ్యే పులకరింతల్లో... పులకరింతల్లో
గాలికైనా సందులేని కౌగిలింతల్లో
పూలు కూడా అత్తరయ్యే పులకరింతల్లో
మీగడంతా దొరకనీవే పాలపుంతలో
జాజిపూల జలకమాడే జలదరింతల్లో
గుడ్డి దీపం గుబులు రేపెనురో చల్ మోహన రంగ
నేను ఉంటే దీపమెందుకు పదరా
చల్ మోహన రంగ నేను ఉంటే దీపమెందుకు పదరా
మల్లె పువ్వు గిల్లింది
తెల్ల చీర నవ్వింది
పక్కనొచ్చి కూకుంటే పట్టు జారిపోయింది
హొయ్ తలుపు గడియ బిగుసుకున్నాదే చల్ మోహన రంగీ
నీకు నాకు జోడు కుదిరెను పదవే
చల్ మోహన రంగీ నీకు నాకు జోడు కుదిరెను పదవే

గోడలన్నీ గొడవ చూసి నవ్వుకుంటుంటే... హొయ్ నవ్వుకుంటుంటే
నీడ కూడా నిజము తెలిసి సిగ్గుపడుతుంటే... సిగ్గుపడుతుంటే
గోడలన్నీ గొడవ చూసి నవ్వుకుంటుంటే
నీడ కూడా నిజము తెలిసి సిగ్గుపడుతుంటే
కిటికిటీలు కటకటాలు కిలుకుమంటుంటే
సందు చూసి చందమామ తొంగి చూస్తుంటే
కోడి కూస్తే కొంప మునగదటే చల్ మోహన రంగీ
కోడి కోసి కూర తిందాం పదవే
చల్ మోహన రంగీ కోడి కోసి కూర తిందాం పదవే
మల్లె పువ్వు గిల్లింది
తెల్ల చీర నవ్వింది
పైట జారి పోయింది
పాలపిట్ట కూసింది
మల్లె పువ్వు గిల్లింది
తెల్ల చీర నవ్వింది
పక్కనొచ్చి కూకుంటే పట్టు జారిపోయింది
పట్టె మంచం కిర్రుమన్నదిరో చల్ మోహన రంగ
నీకు నాకు జోడు కుదిరెను పదరా
చల్ మోహన రంగీ నీకు నాకు జోడు కుదిరెను పదవే



Credits
Writer(s): Dasarathi, Master Venu
Lyrics powered by www.musixmatch.com

Link