Pandiri Vesina

పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
నువ్వు రామ్మా ఓ వేదమా
విడాకుల పత్రిక అందుకుని వెంటనే వేరుచేయుమా
దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మ
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం

ప్రతి మనువూ స్వర్గంలో మునుముందే ముడిబడుతుందా
ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా

నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్య
నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్య
నువ్వు రామ్మా ఓ అరుంధతి
ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మ
నిజంగా పెళ్ళికి బలముంటే సూటిగా ఇటు దిగిరావమ్మ
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం

చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది

ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
నువ్వు రామ్మా మాంగళ్యమా
వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేళ్ళకు
విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి
పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం



Credits
Writer(s): Sitaram Sastry, S.v. Krishna Reddy
Lyrics powered by www.musixmatch.com

Link