Kalaganti Kalaganti

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలలోకములకు అప్పడగు తిరువేంకటాధ్రీశుగంటి

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలలోకములకు అప్పపడగు తిరువేంకటాధ్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి

అతిశయంబైన శేషాద్రీ శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు పొడగంటి
చతురాస్యు పొడగంటి చయ్యన మేలు కొంటి
ఇప్పుడిటు కలగంటి...

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని అభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని చూడగ గంటి
హరి గంటి గురు గంటి
హరి గంటి గురు గంటి
అంతట మేలుకొంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి...
ఎల్లలలోకములకు అప్పడగు తిరువేంకటాధ్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి...
ఇప్పుడిటు కలగంటి...



Credits
Writer(s): M. M. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link