Neeru Neeru

నీరు నీరు నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ
అన్నదాత గోడు నింగినంటె నేడు
ఆలకించు వారు ఎవ్వరూ

నీరు నీరు నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ

గొంతు ఎండిపోయే పేగు మండిపోయే
గంగతల్లి జాడ లేదనీ
నీటి పైన ఆశ నీరుగారి పోయే
రాత మారు దారి లేదని
దాహం ఆరుతుందా
పైరు పండుతుందా
ధారాలైన కంటి నీటితో

నీరు నీరు నీరు
రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ
గుండెలన్ని బీడు
ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ

నేల తల్లి నేడు అంగీలారిపోయే
మూగబోయే రైతు నాగలి
ఆయువంతా చూడు ఆర్తనాదమాయే
గొంతు కోసుకుంది ఆకలిCredits
Writer(s): G. Devi Sri Prasad, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link