Sirimalli Poovalle

సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లే నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నువ్వు, నా నువ్వు

సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వూ, నవ్వూ

ప ని స
స గ మ
గ మ ప
ని ని ప మ గ మ గ మ ప

చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురగల్లె తెలతెల్లగా
చిననాటి కలలల్లె తియతియ్యగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా
రవళించగా

సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

నీ పెదవిపై నవ్వులే కేంపుగా
నీ కనులలో నువ్వు తెలి మెరుపుగా
చెక్కిళ్ళపై నవ్వు నును సిగ్గుగా
చెక్కిళ్ళపై నవ్వు నును సిగ్గుగా
పరువాన్ని ఉడికించి ఉరికించగా
ఉరికించగా

సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వూ నవ్వూ

నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా
నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా
తొలి నవ్వుగా

సిరి మల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు
చిగురిస్తు ఉండాలి నా నువ్వు నా నువ్వు

సిరిమల్లె పువ్వల్లె నవ్వు
చిన్నారి పాపల్లె నవ్వూ, నవ్వూ



Credits
Writer(s): Athreya, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link