Thelavarademo (Male Version) [From "Sruthilayalu"]

తెలవారదేమో స్వామీ
తెలవారదేమో స్వామీ నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ ఉ ఉ ఊ
తెలవారదేమో స్వామీ నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ ఉ ఉ ఊ
తెలవారదేమో స్వామీ

చెలువమునేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువమునేలగ చెంగట లేవని కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ

మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తు నే మది మరి మరి తలచగా
మరి మరి తలచిగ
అలసిన దేవేరి అలమేలు మంగకూ ఉ ఉ ఊ
తెలవారదేమో స్వామీ
గామపని తెలవారదేమో
సా ని ద ప మ ప మ గ ని స గా మ తెలవారదేమో స్వామీ
పా ని ద ప మ గ మ ప స ని ద ప మ గ మ ప స ని రి స గ రి మ గ రి సా రి నీ స తెలవారదేమో స్వామీ



Credits
Writer(s): K V Mahadevan, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link