Veede Veede

విల విల విల వాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా
భగ భగ భగ సూర్యుడి హేల
జల జల జల జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా
ధగ ధగ వీరుడి ఊళ

అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం
మంచు కెరటమై దూసుకు వచ్చిన సైనికుడు (సైనికుడు)
కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం
ప్రాణ కవచమై రణముకు వచ్చిన రక్షకుడు (రక్షకుడు)
గుండె లోతులో తెగిన గాయమై, తగువు న్యాయమై వచ్చాడు
కంచు కోటలో రాకుమారి పెదవంచులపై చిరునవ్వవుతాడు
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే

ఆరేసావో పాతేశావో
నీ ధైర్యం వెతికిచ్చే వాడు
ఆర్చేసావో కాల్చేసావో
నీ కలలన్నీ బ్రతికించే వాడు
నువ్వు మరచినా నిన్ను మరువని జ్ఞాపకంగ తిరిగొచ్చాడు
నిన్ను వలచిన పడమరంచు కొన అంచున మొలచిన తూరుపు వీడు
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే

ఓ... విల విల విల వాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా
భగ భగ భగ సూర్యుడి హేల
జల జల జల జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా
ధగ ధగ ధగ వీరుడి ఊళ
ఓ అమ్మ ఒడై ప్రేమందించి
నీ హృదయం లాలించే వాడు
ఓ బ్రహ్మ ముడై నీ సంకెలని
నీ శత్రువుని చేధించే వాడు
ముగిసిపోయిన నుదుటి రాతనే మలుపు తిప్పు మొదలవుతాడు
సగము వెన్నెల, సగము జ్వాలగా రగిలే ప్రేమ వికిరణం వీడు
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్ష్యకుడే
వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే
వీడే వీడే నిను హరివిల్లుగ మారుస్తాడే
వీడే వీడే నీ బలము బలగం వీడే



Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link