Yase Kothagundi

యాసే కొత్తగుంది
శ్వాసే మత్తుగుంది
ఊసే ఆడమన్నదోయ్
వేషం ముద్దుగుంది
మీసం తిప్పమంది
పల్లె స్వచ్చమైనదోయ్

చుట్టంలా చూడదు నిన్ను
బంధాలే కలిపే కన్నురెప్పల్లె దాచుకుంటదోయ్
హక్కే ఇస్తుంది మన్ను మనసే ఉంటె ఇపుడే దున్ను
కడదాకా దాచుకుంటదోయ్, ఓయ్, ఓయ్,ఓయ్

ఉయ్యాలే ఉయ్యాలే ఊగే ఉయ్యాలే
పాప బోసి నవ్వల్లే ఓని కట్టిన పడిచల్లే
ఊరే ఊరించే ఊరించేలే, లే, లే

ఇయ్యాలే ఇయ్యాలే బ్రతికేదీయాలే
నిన్న గడిచిందిలే, రేపటిదేముందిలే
కష్టం కనరాని పొలిమేరలే

(పొద్దు పొదుపుల సూరీడే
సుర్రు సుర్రున సూసిండే
లోకం మొత్తం నిద్దుర లేపిండే
పచ్చ పచ్చని పల్లెల్లో
పుత్తడి పండే దారుల్లో
రారమ్మంటూ నిన్నే పిలిచిండే)

అలికె వాకిట్లో
ఉలికె ముగ్గుల్లో
చిమ్మే రంగుల్లోనే పండగుందంటా
ఇరుగు పొరుగుల్లో
బిరిసె ముచ్చట్లే
బిన్న అరుగుకి కూడా నవ్వొస్తుందంటా
వలపుల తోటల్లో
చిలకల కిలకిలలో
కసురుల్లో రుచి పుట్టిస్తుంటే
చేపల వెకల్లో, ఏకినో ఈతల్లో
ఉల్లాసం ఉరకలు వేస్తుంటే

కయ్యాలే కయ్యాలే చిలికి కయ్యాలే
కోపం కట్టలు తెరిచెట్టు
రోషం తొడలు చరిచెట్టు
కోడి పందాల ఉస్తాదులే

వియ్యాలే వియ్యాలే వస్తే వియ్యాలే
విందు రుచి చూపిస్తూ
ఆకు వక్కలు చుట్టిస్తూ
పొంగి పోతాయి మరియాదలే

ఉక్కు కండల్లో
చెమట చినుకల్లో
అభిమానం పండే చిత్రం చూసావా
ఊరి గుడిసెల్లో పూసే నవ్వుల్లో
అనురాగం వింటే లోకం మరిచేవా
మారే పొద్దుల్లో తిరుగుడు పువ్వులతో గడియారం పోటీపడినట్టు
మెలికల దారుల్లో
మెతుకుల చేనుల్లో
సరదాలో అలుపే మరిచెట్టు

తయ్యారే తయ్యారే అంత తయ్యారే
అందరు ఇకపై నీవారే
నిన్ను అతిథని అనుకోరే
సంతోషాలెన్నో పంచిస్తారే

సయ్యారే సయ్యారే సయ్య సయ్యారే
నిన్ను తలచే ఈ ఊరే
అను నిత్యం పొలమారె ఆనందాన్ని అందిస్తారే



Credits
Writer(s): Naresh Penta, Sahityya Sagar
Lyrics powered by www.musixmatch.com

Link