Mounam Gaanam

మౌనం గానం మధురం మాధురాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం
హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

(సా రినిదాప మగరిసారీ
గరిస నిదప గరిస
సా రినిదాప మగరిసారీ)

(సరిసని సనిదప గమపదని సా)

(సరిసని సనిదప గమపదని
సానిదపమ గమపదని
సా రినిదాప మగరిసారీ)

చైత్ర పవనాలు వీచే
మైత్రి గంధాలు పూసేను
వయసు ముంగిళ్ళు తీసి వలపులే ముగ్గులేసేను
సుమ వీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలేన్నెన్నెన్నో
సాగేనులే శ్రుతిలో కృతిగా
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం

(వానిపొందు చాలు వద్దనే వనితామణి అలా
వానిపొందు చాలు వద్దనే
జాణ మాటలెల్ల దాని
జాణ మాటలెల్ల దాని సదనమే సదన మనుసులుండేది
వానిపొందు చాలు వద్దనే)

(ససససానిప సానిప
మమమమామాద
దదదదానిస దాపమ
పాపపపామారి పాపపపాదానిస)

అరుణ చరణాలలోనే
హృదయ కిరణాలు వెలిగేను
ముదిత పాదాల మువ్వే
మువ్వ గోపాల పాడేను
అవి మోహాలో మధు దాహలో
చెలి హాసాలో తొలి మాసాలో
హంసధ్వనీ కళలే కలగా

మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం
హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం



Credits
Writer(s): Balasubrahmanyam S P, Mankomp Gopalakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link