Yedukondala Paina

ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో

తెలియని వారికి తెలుపర స్వామి
తెలియని వారికి తెలుపర స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
ఆ ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావు
ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు
ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావు

అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో ఆ
అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో
ఏ అర్థమున్నదో ఏ సత్యమున్నదో
తెలియని వారికి తెలుపర స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి ఋణమును తీర్చుకుంటున్నావో
రెండు ప్రేమల మధ్య
బండగా మారావు స్వామి
రెండు ప్రేమల మధ్య
బండగా మారావు
రేపు లేని నీకు దోపిడీ ఎందుకో
తెలియని వారికి తెలుపర స్వామి
కన్నుల పొరలను తొలగించవేమి

ఏడుకొండలపైన ఏల వెలిశావో
ఎవరికీ అందక ఎందుకున్నావో



Credits
Writer(s): Athreya, Shibu Chakravarthi
Lyrics powered by www.musixmatch.com

Link