Kanula Mundhu Neevunte

పరిమళించు వెన్నెల నీవే
మ్మ్
పలకరించు మల్లిక నీవే
మ్మ్
నా జీవన బృందావనిలో
మ్మ్
నడయాడే రాధిక నీవే

కనుల ముందు నీవుంటే కవిత పోంగి పారదా
మ్మ్
తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా
మ్మ్

కనుల ముందు నీవుంటే కవిత పోంగి పారదా
తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా

అలనాటి జనకుని కోలువులో తోలి సిగ్గుల మేలి ముసుగులో
అలనాటి జనకుని కోలువులో తోలి సిగ్గుల మేలి ముసుగులో
ఆఆరాముని చూసిన జానకివై.
అభిరాముని వలపుల కానుకవై.
వాల్మీకి కావ్య వాకిట వెలసిన వసంత మూర్తివి నీవే

కనుల ముందు నీవుంటే కవిత పోంగి పారదా
తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా

అలనాటి సుందరవనములో
వనములో
ఎల ప్రాయం పోంగిన క్షణములో
అలనాటి సుందరవనములో ఎల ప్రాయం పోంగిన క్షణములో
ఆఆరాజును కనిన శకుంతలవై.
రతిరాజు భ్రమించిన చంచలవై.
కాళిదాసు కల్పనలో మెరిసిన కమనీయ మూర్తివీవే
కనులముందు నీవుంటే
కవిత పోంగి పారదా
తొలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా

అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై.
అజంతా చిత్ర సుందరివై ఎల్లోరా శిల్ప మంజరివై.
రామప్ప గుడి మోమున విరిసిన రాగిణివై నాగినివై.
అమరశిల్పులకు ఊపిరిలూదిన అమృతమూర్తివి నీవే
కనుల ముందు నీవుంటే కవిత పోంగి పారదా
తోలి చిగురుల చూడగానే కల కోకిల కూయదా



Credits
Writer(s): K V Mahadevan, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link