Yemi Cheyamanduve

లేదనిచెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె
ఏమిచేయమందువే

గంధపుగాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమలప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలోప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే

లేదనిచెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె
ఏమిచేయమందువే ఏమిచేయమందువే

గంధపుగాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమలప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా
చెలియా నాలోప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే

లేదనిచెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె
ఏమిచేయమందువే ఏమిచేయమందువే

హృదయమొక అద్దమని, నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమని
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాలఊయల బింబమూగే చెలి
నువ్వు తేల్చిచెప్పవే పిల్లా, లేక కాల్చిచంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే

లేదనిచెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె
ఏమిచేయమందువే ఏమిచేయమందువే

గంధపుగాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా
ప్రేమలప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా

తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖి
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలి
విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే
నా ప్రియసఖియా ఇక భయమేల నా మనసెరిగి నా తోడుగ రావే

ఏమిచేయమందువే ఏమిచేయమందువే
ఏమిచేయమందువే ఏమిచేయమందువే న్యాయమా న్యాయమా
ఏమిచేయమందువే ఏమిచేయమందువే మౌనమా మౌనమా
(ఏమిచేయమందువే)



Credits
Writer(s): Siva Ganesh, A R Rahman, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com

Link