Pachchadanamey

(సఖియా
చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా
చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన తొలిపండు)

పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే

పచ్చందనమే పచ్చదనమే
ఎదిగే పరువం పచ్చదనమే
నీ చిరునవ్వు పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే
ఎదకు సమ్మతం చెలిమే

కలికి చిలకమ్మ ఎర్రముక్కు
ఎర్రముక్కులే పిల్లవాక్కు
పువ్వై పూసిన ఎర్రరోజా
పూత గులాబి పసిపాదం

ఎర్రాని రూపం ఉడికే కోపం
ఎర్రాని రూపం ఉడికే కోపం
సంధ్యావర్ణ మంత్రాలు వింటే
ఎర్రని పంట పాదమంటే
కాంచనాల జిలుగు పచ్చ
కొండబంతి గోరంత పచ్చ
పచ్చ పచ్చ ప చ్చ
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం

(సఖియా
చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా
చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన తొలిపండు)

అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పువ్వు తొలి వర్ణం
ఊదా పూ రెక్కలపై వర్ణం
ఎన్నో చేరే నీ కన్నె గగనం
నన్నే చేరే ఈ కన్నె భువనం

రాత్రి నలుపే రంగు నలుపే
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారు నలుపే
కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగీ పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే

(సఖియా
చెలియా
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా
చెలియా
నీ ఒంపే సొంపే తొణికిన తొలిపండు)

తెల్లని తెలుపే ఎద తెలిపే
వానలు కడిగిన తుమి తెలుపే
తెల్లని తెలుపే ఎద తెలిపే
వానలు కడిగిన తుమి తెలుప
ఇరుకనుపాపల కథ తెలిపే
ఉన్న మనసు కుదిపే
ఉడుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, A Rahman
Lyrics powered by www.musixmatch.com

Link