Omkaranadhanu

ఓం... ఓం...

ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణం
ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణం
శంకరాభరణము...

శంకర గళనిగళము శ్రీహరి పద కమలము
శంకర గళనిగళము శ్రీహరి పద కమలము
రాగ రత్న మాలికా సరళము
శంకరాభరణము...

శారద వీణ .ఆ ఆ ఆ ఆ.
శారద వీణ రాగ చంద్రిక పులకిత శారద రాత్రము
శారద వీణ రాగ చంద్రిక పులకిత శారద రాత్రము

నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము
నారద నీరద మహతి నినాద గమకిత శ్రావణ గీతము

రసికులకనురాగమై రసగంగలో తానమై
రసికులకనురాగమై రసగంగలో తానమై
పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము
శంకరాభరణము.

అద్వైత సిద్దికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము
అద్వైత సిద్దికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము

సత్వ సాధనకు సత్య సోధనకు సంగీతమే ప్రాణము
సత్వ సాధనకు సత్య సోధనకు సంగీతమే ప్రాణము

త్యాగరాజ హృదయమై రాగ రాజ నిలయమై
త్యాగరాజ హృదయమై రాగ రాజ నిలయమై
ముక్తినొసగు భక్తి యోగ మార్గము
మృతియేలేని సుధాలాప స్వర్గము శంకరాభరణము

ఓంకార నాదాలు సంధానమౌ గానమే శంకరాభరణము
పా దా ని శంకరాభరణము ...
పమగరి, గమపదని శంకరాభరణము
సరిసా, నిదప, నిసరి, దపమ, గరిగ, పమగ పమద పనిద సనిగరి శంకరాభరణము

అహా
దపా, దమా, మాపాదపా
మాపాదపా
దపా, దమా, మదపామగా
మాదపామగా

గమమదదనినిరి, మదదనినిరిరిగ
నిరిరిగగమమద, సరిరిససనినిదదప శంకరాభరణము

రీససాస, రిరిసాస, రీసాస, సరిసరీస, రిసరీసరీసనిద, నీ నీ నీ
దాదనీని, దదనీని, దానీని దనిద, దనిద, దని, దగరిసానిదప, దా దా ద
గరిగా, మమగా
గరిగా, మమగా
గరి, గమపగా, మపద, మదపమ, గరిసరి, సరిగసరీ
గరి, మగపమదప
మగపమదప, నిదపమదప, నిదసనిదప, నిదసనిరిస
గరీసా, గరిసనిదరీసా, రిసనిదపసా, గరిసనిద, నిసనిదప, సనిదపమ, నీసాని
నిసనిదపనీదా సనిదపమపా, రిసనిదప, సరిదపమ, గమమగరి, గమదా
నిసనిపద, మపా, నిసనిదప నీ, దపమగరి, రిసనిదప మగరిసరిసని శంకరాభరణము
శంకరాభరణము...



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link