Ninnila - From "Toliprema"

నిన్నిలా నిన్నిలా చూశానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వెయ్యనంతగా కనులపండగే

నిన్నిలా నిన్నిలా చూశానే
అడుగులే తడపడే నీవల్లే
గుండెలో వినపడిందిగా ప్రేమచప్పుడే

నిను చేరిపోయే నా ప్రాణం
కోరెనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం, నాలో ఆనందం
నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా

తొలి తొలి ప్రేమే దాచేయకలా
చిరు చిరు నవ్వే ఆపేయకిలా
చలి చలి గాలే వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా
నిను నీ నుంచి నువ్వు బైటకు రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా

ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాళే ఇలా



Credits
Writer(s): S Thaman, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link