Ninnila (From "Tholi Prema")

నిన్నిలా నిన్నిలా చూశానే
కళ్ళలో కళ్ళలో దాచానే
రెప్పలే వేయనంతగా
కనుల పండగే

ఏ, నిన్నిలా నిన్నిలా చూశానే
అడుగులే తడబడే నీవల్లే
గుండెలో వినబడిందిగా
ప్రేమ చప్పుడే

నిను చేరి పోయే నా ప్రాణం
కొరెనేమో నిన్నే ఈ హృదయం
నా ముందుందే అందం నాలో ఆనందం
నన్ను నేనే మరిచిపోయేలా ఈ క్షణం

ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెలే ఇవ్వాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెలే ఇవ్వాళే ఇలా

తొలి తొలి ప్రేమే దాచేయికలా
చిరు చిరు నవ్వే ఆపేయికిలా
చలి చలి గాలి వీచేంతలా
మరి మరి నన్నే చేరేంతలా
నిను నీ నుంచి నువ్వు బయటకి రానివ్వు
మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా

ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెలే ఇవ్వాళే ఇలా
ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా
ఈ ఎదలో నీ పేరే పలికెలే ఇవ్వాళే ఇలా



Credits
Writer(s): S Thaman, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link