Srirasthu Shubhamasthu - From "Bobbili Simham"

శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు
శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు
మా గుండె గుడిలో ఆశల ఒడిలో జ్యోతిని వెలిగించగా

శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు

ఏ పూజకేపువ్వు ఋణమై పూసిందో కాలానికే తెలుసటా
ఆ కాలం కనుమూస్తే కలగా చెరిగేది జీవితమొకటేనటా
సవతిగ కాకుండ చెల్లిగ నను చూసి తల్లిని చేశావుగా
ఈ పారాని పాదాలు సేవించినా గాని ఋణమే తీరదుగా
ఇది కలకాలమై ఉండగా...
నీ అనుబంధమే పండగా...
ఇంటికి దీపం ఇల్లాలనిపించు నా ముద్దు చెల్లాయిగా

శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు

ఎదిగే మరణాన్ని ఎదలో దాచేసి కథగాచే దేవుడు
పంతాల గిరి గీసి ప్రణయాన్ని ఉరివేసి మోసం చేశాడు
రాగాలు వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే
ఆ వేకువలా మళ్ళి రేకులు వెదజల్లి రవియే పుడతాడులే
ఆ దీపంలో నీ రూపమే పూపాపల్లె ఆడాలని
ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడేనులే

శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు
శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు

Credits
Writer(s): M. M. Keeravani, Veturi Sundararama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link