Guvvala Yegiri Povali (From "Amma Kosam")

ఆ ఆ ఆ ఆ ఓ ఓహొ హో
హేహేయ్
గువ్వలా ఎగిరిపోవాలి ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ
గువ్వలా ఎగిరిపోవాలి ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ
ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో మూగకన్నీరు మిగిలెను కనుపాపలో
ఇన్నాళ్ళు రగిలెను చెరసాలలో మూగకన్నీరు మిగిలెను కనుపాపలో
ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే
ఆ కన్నీరు తుడిచే పన్నీరు చిలికే చల్లని ఆ చేయి కావాలి
ఆమె చెరణాలపై వాలిపోవాలి
గువ్వలా ఎగిరిపోవాలి ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ
జగమంత ఒక వింత చదరంగము పాడు విధియేమో కనరాని సుడిగుండము
జగమంత ఒక వింత చదరంగము పాడు విధియేమో కనరాని సుడిగుండము
ఆ లోతులు చూసీ రీతులు తెలిసీ
ఆ లోతులు చూసీ రీతులు తెలిసి అలలాగా చెలరేగి పోవాలి
నేననుకున్న గమ్యం చేరాలీ
గువ్వలా ఎగిరిపోవాలి ఈ ఈ ఈ
ఆ తల్లి గూటికే చేరుకోవాలీ ఈ ఈ ఈ



Credits
Writer(s): Dr. C Narayana Reddy, P. Adhinarayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link