Okade Okkadu

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేల
పువ్వుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిన నాడు
ఆనందాలే విరియును చూడు

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

(సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా
సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా
సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా
సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా
సైయ్య సైయ్యారే, సైయ్యారే, సైయ్యా)

మట్టి మీద మనిషికి ఆశ
మనిషి మీద మట్టికి ఆశ
మట్టి మీద మనిషికి ఆశ
మనిషి మీద మట్టికి ఆశ
మన్నే చివరికి గెలిచేది
అది మరణంతోనే తెలిసేది
కష్టం చేసి కాసు గడిస్తే
నీవే దానికి యజమాని
కోట్లు పెరిగి కొవ్వు బలిస్తే
డబ్బే నీకు యజమాని
జీవిత సత్యం మరవకు రా
జీవితమే ఒక స్వర్గము రా

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేల
పువ్వుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిన నాడు
ఆనందాలే విరియును చూడు

వాన మనది ప్రకృతి మనది
తన పర బేధం ఎందుకు వినరా
వాన మనది ప్రకృతి మనది
తన పర బేధం ఎందుకు వినరా
కాల చక్రం నిలవదు రా
ఈ నేల స్వార్ధం ఎరగదు రా
పచ్చని చెట్టు పాడే పక్షి
విరులు ఝరులు ఎవ్వరివి
మంచిని మెచ్చే గుణమే ఉంటే
ముల్లోకాలే అందరివి
జీవితమంటే పోరాటం
అది మనకే తీరని ఆరాటం

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు

ఒకడే ఒక్కడు మొనగాడు
ఊరే మెచ్చిన పనివాడు
విధికి తలొంచడు ఏనాడు
తల ఎత్తుకు తిరిగే మొనగాడు
భూమిని చీల్చే ఆయుధమేల
పువ్వుల కోసం కొడవళ్ళేల
మోసం ద్వేషం మరచిన నాడు
ఆనందాలే విరియును చూడు



Credits
Writer(s): Bhuvana Chandra, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link