Ela Ela Daachavo (From "Gorintaaku")

ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎదా
ఉసురుసురనినా గుసగుసమనినా ఊగదేమది నీ మది
నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో
ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా
తెరిచి ఉందనీ వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా
దొరవో మరి దొంగవో
దొరవో మరి దొంగవో దొరికావు ఈనాటికీ
దొంగను కానూ దొరనూ కానూ
దొంగను కానూ దొరనూ కానూ నంగనాచినసలే కానూ
ఎలా ఎలా దాచావు అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ



Credits
Writer(s): K V Mahadevan, Devulapalli Krishna Sastry
Lyrics powered by www.musixmatch.com

Link