Teluguveera Levaraa

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తెలుగు వీర లేవరా ఆ ఆ ఆ
దీక్ష బూని సాగరా ఆ ఆ ఆ
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
ఆ ఆ ఆ
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
ఆ ఆ ఆ
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా

నిదురవద్దు బెదరవద్దు
నిదురవద్దు బెదరవద్దు
నింగి నీకు హద్దురా
నింగి నీకు హద్దురా
ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ

ఓ ఓ ఓ ఓ ఓ
ఎవడువాడు ఎచటివాడు
ఎవడు వాడు ఎచటి వాడు ఇటువచ్చిన తెల్లవాడు
ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం కొండబలం కబళించే దుండగీడు
కబళించే దుండగీడు
మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు
దొచుకొనే దొంగ వాడు
ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు
తగినశాస్తి చేయరా
తగిన శాస్తి చేయరా
తరిమి తరిమి కొట్టరా
తరిమి తరిమి కొట్టరా

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
ఆ ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ ఓ ఓ

ఓ ఓ ఓ ఓ ఓ
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

ఈ దేశం
ఈ రాజ్యం
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి
నాదే అని చాటించి
ప్రతిమనిషి తొడలు గొట్టి శృంఖలాలు పగులగొట్టి
శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి తుది సమరం మొదలుపెట్టి
తుది సమరం మొదలుపెట్టి

సింహాలై గర్జించాలీ
సింహాలై గర్జించాలీ

సంహారం సాగించాలీ
సంహారం సాగించాలీ

వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం
వందేమాతరం

ఓ ఓ ఓ ఓ ఓ
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా
అందుకో మా పూజ లందుకో రాజా
అందుకో మా పూజ లందుకో రాజా
అల్లూరిసీతారామరాజా ఆ అల్లూరిసీతారామరాజా

ఓ ఓ ఓ ఓ ఓ
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా

త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం
త్యాగాలే భరిస్తాం కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం
నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం
నీ వెంటనే నడుస్తాం



Credits
Writer(s): Sri Sri, P Adi Narayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link