Vennela O Vennela (From "Neevevaro")

వెన్నెలా ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా
ఓ ప్రాణం కదిలించింది నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం నీ వరం
ఒక మాయ నీ పరిచయం ఓ
వెన్నెలా ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా

మాటే వినని మనసేగిరిపోని
చెలిమే రెక్కలివ్వగా
నీకే తెలియదంటున్న నిజమే లోకం చూడగా
సందేహం వీడని
ఈ మాయే మదిలో నిండని
సంతోషం పొంగని
నీ హృదయం నీలో లేదనీ

ఓ మాటల్లోనే మోమాటం కరిగించి
నిన్ను నన్ను స్నేహం పెనవేసింది
అలవాటే లేదుగా అడిగేది కాదుగా
ఈ వింతల వేడుకా చెలిమికి రుజువేగా
ఎన్నో ఊహల్లో మన ఉనికే వెతికానే
నువ్వే ఎదురైతే ఆ ఏకాంతంలో
నాలో మౌనం మోగదే

వెన్నెలా ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా ఓ

ఏ చోటున్నా నను నీలో చూస్తున్నా
నువు లేవన్న తలపే చెరిపేస్తున్నా
అడుగడుగే చీకటై నిశిలో ముంచేసినా
నీ రాకే వేకువై నను నడిపెను ప్రేమా
నీతో క్షణ కాలం కలకాలంలా ఉందే
అందం ఆనందం కలగలిపి
చూపిస్తున్నా అద్దం మన కధే

వెన్నెలా ఓ వెన్నెలా
నా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలా
నిన్నలా నే లేనుగా
ఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా ఓ
ప్రాణం కదిలించింది నీ స్వరం
అడుగేస్తూ నాతో వచ్చే స్నేహం నీ వరం
ఒక మాయ నీ పరిచయం ఓ వెన్నెలా



Credits
Writer(s): Saraswati Putra Ramajogayya Sastry, Harshavardhan Rameshwar
Lyrics powered by www.musixmatch.com

Link