Edo Jarige

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడూ ఎరుగనిది కలుగుతోంది
మండే ఎండల్లో చలి వేస్తోంది
చల్లని చలిలోన చమటడుతోందే
మదిలో ఓ వర్షం మొదలయ్యిందే
ప్రాణం పోయెట్టుందే
తీయని గాయం చేసెను ప్రాయం
బిగ్గరగా నన్ను బిగిసిన ప్రణయం
ఏంటీ మోహం వలపుల తాపం
సంద్రం తాగిన తీరని దాహం
ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడూ ఎరుగనిది కలుగుతోంది

కలలే చేరే కనుల పక్షుల గుంపులుగా
అలలై నన్ను ముంచే లక్షల ఊహలిలా
గుండె విరహంతో మండుతువుందే
తనువేమో ఓ తోడు కోరుతువుందే
అతడే కావాలంటూ అడుగుతువుందే
హృదయం ఈ రోజే
ఏమిటి చిత్రం ఒకటే ఆత్రం
నాతో నాకైయ్యెను చిలిపిగా యుద్దం
నిన్నటి సాంతం అయ్యెను అంతం
నాలో రేగెను చిరు భూకంపం
ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడూ ఎరుగనిది కలుగుతోంది

కల్లోలం నా ఆనందం ఒకటై ఎగిసిందే
కన్నీరు పన్నీరు వరదై ముంచిందే
నా దేహం నాదసలు కానట్టుందే
నిన్నల్లే ఈ రోజు లేనట్టుందే
నేనసలు నేనేనా అనిపిస్తోందే
మైకం కమ్మేసిందే
నిమిషం నిమిషం తియ్యని నరకం
బాధలో చూస్తున్నా నూతన స్వర్గం
మధురం మధురం మరిగెను రుధిరం
సన్నగ ఒణికెను ఎర్రని అధరం
ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడూ ఎరుగనిది కలుగుతోంది



Credits
Writer(s): Suresh Bobbili
Lyrics powered by www.musixmatch.com

Link