Pelli Pandhiri

పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగా కనరండి
కోడి పందెం కాదండి
జోడు బంధం చూడండి
హే ఇద్దరినోక్కటి చేసే మండపాన
అందరికందరూ బంధువులండి
హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన
చిందర వందరలెందుకండి
మనువు కదా ఇలా మొదలయింది
మనసులను అదే కలుపుతుంది
నడుమ గల తేరే తొలుగునండి
వరస కలుపుతూ పలకరండి
పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగా కనరండి

తాళి బొట్టై మెడలోన
కాలిమెట్టై చేరనాన
ఏనాడు విడువని బంధికాన
అతడు నిన్ను అడిగెను కదా
వెయ్యేళ్ల వరమే వరుడు తానే
వెతికి నిను కలిసెను కదా
ఈ తలపులే పూల జాడగా వెన్నె వంచుతుంటే
ఇంపైన దొరసాని అదేదో తలవొమ్పేమి కాదు అని
పెళ్లీడు బరువుయిదని అంటారు దీన్ని అలివేణి
పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగా కనరండి

పాణి గ్రహణం జరిపించి
సప్త పదిగా నడిపించే
పెద్దరికం అన్నది పదవిగాని పరువు చెడుపని కాదని
శ్రీహరికి వధువును కాళ్ళు కడిగి ధార పోస్తే ఘనతని
ఈ ఇద్దరినీ దీవించు పని మీ పుణ్యమండి
యదార్థం ఇదే అండి తదస్తాని నోరారా పలకండి
ముహూర్త బలమండి మమతలను ముడిపడి నీయండి

పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగా కనరండి
కోడి పందెం కాదండి
జోడు బంధం చూడండి
హే ఇద్దరినోక్కటి చేసే మండపాన
అందరికందరూ బంధువులండి
హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన
చిందర వందరలెందుకండి
మనువు కదా ఇలా మొదలయింది
మనసులను అదే కలుపుతుంది
నడుమ గల తేరే తొలుగునండి
వరస కలుపుతూ పలకరండి



Credits
Writer(s): Gopi Sundar, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link