The Karma Theme - Telugu (From "U Turn")

దిశల్ని మార్చుకున్నా
ఎలాంటి దారిలో పోతున్నా
మనస్సు మారుతున్నా
గతాల జ్ఞాపకం ఏదైనా

సదా నువ్వే కదా ప్రతీ క్షణాన
సదా ఎలాగ చూసినా
సంతోషాల రూపం నువ్వే
కదిలిన కన్నీటి ధారవే
నడిపిన బలం నువ్వే
ముసిరిన భయాల నీడవే

మరొక్కసారి చూడు

కలల్లో తేలుతున్నా
అవేవో ప్రశ్నలే లోలోన
ఎలాంటి ఊహలైనా
నువ్వైన పాత్రాలే ఎన్నైనా

ఏదో తెలీని ఈ ప్రయాణమేదో
ఎటో ముగింపనేదెటో
వెతికిన నిజం నువ్వే
కలిసిన ప్రపంచమూ నువ్వే
నడిచిన దారి నువ్వే
నిలిచిన తీరానివి నువ్వే

మరొక్కసారి చూడు

నువ్వే ఇలా ప్రతీ కథా నువ్వేగా
నువ్వై మళ్ళీ అన్నీ రావా ఎదురుగా
నువ్వే ఇలా ప్రతీ కథా నువ్వేగా
నువ్వై మళ్ళీ అన్నీ రావా ఎదురుగా
సదా నువ్వే కదా ప్రతిక్షణాన
సదా ఎలాగ చూసినా

మరొక్కసారి చూడు



Credits
Writer(s): Anirudh Ravichander, Subu
Lyrics powered by www.musixmatch.com

Link