Jabilammavo (From "Bunny")

జాబిలమ్మవో జాజికొమ్మవో గాజుబొమ్మవో
ఓ మైనా "I Love You"!
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనెపట్టువో
I don't know "What to do?"
ఇంటిముందు రంగవల్లివో
ఓ చెలి! పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన భక్తి పాటవో
ఓ ప్రియా! పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై, ఇష్టమే స్నేహమై, ప్రాణమై నిలిచినావుగా!
జాబిలమ్మవో జాజికొమ్మవో గాజుబొమ్మవో
ఓ మైనా "I Love You"!

హో' నీ పెదాలపైన నా పెదాలతోన
నీ పెదాలపైన నా పెదాలతోన
ఆ పదాలు నీకు రాసి చూపనా
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఈ క్షణాలలోన ఆ యుగాలు దాటి
ఆ జగాలలోని ప్రేమ పంచనా
బొట్టుమీద ఒట్టు పెట్టనా
కాటుకల్లె కావలుండనా
గుండెమీద ఒట్టు పెట్టనా
అడుగులోన గూడు కట్టనా
జన్మకే బంధమై, ప్రేమకే బానిసై, పూజకే భక్తుడవ్వనా!
జాబిలమ్మవో జాజికొమ్మవో గాజుబొమ్మవో
ఓ మైనా "I Love You"!

హో' నీ మనస్సులోకి నా మనస్సు చేరి
నీ మనస్సులోకి నా మనస్సు చేరి
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
ఆ సమస్యలన్ని ఆవిరవ్వగా
ముత్యమంత ముద్దుపెట్టనా
మూడుముళ్ళ బంధమేయనా
వెన్నెలంత ముద్దుపెట్టనా
ఏడుజన్మలేకమవ్వనా
రేయికే రాజునై, పగటికే బంటునై, రాణికే రాజ్యమవ్వనా!
జాబిలమ్మవో జాజికొమ్మవో గాజుబొమ్మవో
ఓ మైనా "I Love You"!



Credits
Writer(s): Devi Sri Prasad, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link