Chiru Chiru Navvula

చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం
పండగ కాదా
చుర చుర చూపుల చాటున చిలిపిదనమ్
ఉరకలు వేయదా
సంగీతం పలికేటీ ఈ నిమిషం
గుండెల్లో చిలికిందీ సంతోషం
ఎప్పటికీ తీరదుగా ప్రేమ ఋణం
కలహాన్నే చెరిపేసే ఈ తరుణం
ఆ పైనున్న తారల్లో దూరాలేనున్నా
అనురాగాలా ఆకాశం అన్నిటినీ కలిపేనా

చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం
పండగ కాదా

కన్న ప్రేమ దాచలేక
కన్న ప్రేమ దాచలేక
తన మాటల్నే దాచింది ఓ హృదయం
ఉన్న మాట చెప్పలేక
ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం
నిన్నని మరిచే వరమే ఉంది కదా
రేపటి అడుగే నేటికి వారధిగా
చుట్టూతా చుట్టాల సందడిలో
పరివారం పెరిగేటి పందిరిలో
ఆ పైనున్న తారల్లో దూరాలేనున్నా
అనురాగాలా ఆకాశం అన్నిటినీ కలిపేనా

బుద్ధిమంతుడల్లే వీడే
తన చూపుల్తో మాయేదో చేస్తాడే
వెన్న దొంగ లాంటి వాడే
కన్నె మనసుల్ని దోచేసే సొగ్గాడే
గారం పెంచి అల్లరి చేస్తాడే
వీడెక్కడ ఉంటే అక్కడ వేడుకలే
ఈ ఆనంద సందోహ సమయాన
సరితూగదా ఏపాటి సిరులైన
ఆ పైనున్న తారల్లో దూరాలేనున్నా
అనురాగాలా ఆకాశం అన్నిటినీ కలిపేనా



Credits
Writer(s): Thaman S, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link