Tharagani Baruvaina

తరగని బరువైనా వరమని అనుకుంటూ
తనువున మోశావే అమ్మ
కడుపున కదలికలు కలవర పెడుతున్నా
విరివిగ పంచావే ప్రేమ
కను తెరవక ముందే కమ్మని నీ దయకు
రుణపడిపోయింది జన్మ

తందాని నానే తారినన్నానో తానే నానే నో
హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో

చితికిన బతుకులలో చీకటి అడిగింది
వెతికే వేగుచుక్కా ఎక్కడని
కుత్తుక తెగనరికే కత్తుల అంచులతో
దినమొక నరకంగా ఎన్నాళ్ళనీ
అలసిన గుండెలలో ఆశలు వెలిగించు
అండై నీతో ఉన్నానని

తందాని నానే తారినన్నానో తానే నానే నో
హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో
తందాని నానే తారినన్నానో తానే నానే నో
హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో



Credits
Writer(s): Ramajogayya Sastry, Ravi Basrur
Lyrics powered by www.musixmatch.com

Link