Yethimesi Thodina (From "Praanam Khareedu")

యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడెసలోదైనా గాలి ఇసిరికొడితే
ఆ దీపముండదూ ఆ దీపముండదూ
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు

పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా

పసుపుతాడు ముడులేత్తే ఆడదాయెరా
కుడితి నీళ్లు పోసినా అది పాలు
కుడుపుతాదీ
కడుపుకోతకోసినా అది మనిషికే జన్మ ఇత్తాదీ
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు

అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దెలో ఉన్నా సెట్టునీడ తొంగున్నా
నిదరముదరపడినాకా పాడిఒక్కటే హ హ వల్లెకాడు ఒక్కటే
కూతునేర్చినోల్ల కులం కోకిలంటరా హ హ
ఆకలేసి అరసినోళ్లు కాకులంటరా
యాతమేసి తోడినా యేరు ఎండదూ
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు



Credits
Writer(s): Shibu Chakravarthi, Jalladhi
Lyrics powered by www.musixmatch.com

Link