Jaamurathiri (From "Kshana Kshanam")

జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజి కొమ్మ
జారనీయకే కలా
వయ్యారి వాలు కళ్ళలోన
వరాల వెండి పూలవాన
స్వరాల ఊయలూగు వేళ
జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా

కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందని
వనము లేచి వద్ద కొచ్చి నిద్రపుచ్చని
జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా

మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషా తీరం వెతుకుతూ
నిదరతో నిశారానే నడిచిపో
చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి

జాము రాతిరి జాబిలమ్మ
జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజి కొమ్మ
జారనీయకే కలా
వయ్యారి వాలు కళ్లలోన
స్వరాల ఊయలూగు వేళ



Credits
Writer(s): M.m. Keeravaani, Siri Vennela Seetha Ramasasthry
Lyrics powered by www.musixmatch.com

Link