Shivam Shivam - Studio

పంచభూత హిత గాత్రమిదే
పంచభూత కృత క్షేత్రమిదే
పంచభూత హిత గాత్రమిదే
పంచభూత కృత క్షేత్రమిదే
సాక్ష్యం జరిగే ప్రతి చర్యకి
సాక్ష్యం చేసే ప్రతి ఖర్మకి
సత్యం అసత్యాలకి విదితం రహస్యాలకి
అన్నిటి కన్నిటి కన్నిటికున్నది సాక్ష్యం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచ భూతేశ్వరం
అనాధీశ్వరం ఆధీశ్వరం స్వర్వకాలేశ్వరం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
నాలుగు దిక్కుల మధ్యన
నలుగురి కన్నులు కప్పినా
అయిదో దిక్కొకటున్నది పైన
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
పంచభూతాల సాక్షిగా
పంచభూతేషు సాక్షిగా
పాఠం చెబుతది పాపం పండిన రోజున
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
శబ్ద గుణకం ఆకాశం, విశ్వ జనకం ఆకాశం
సకల కధనాన్ని సాక్షిగా వీక్షించే
అనంత నయనం ఆకాశం
అనంత నయనం ఆకాశం
యుగాలు క్షణాలకైనా నిగూఢ నిజాలకైనా
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
నాలుగు దిక్కుల మధ్యన
నలుగురి కన్నులు కప్పినా
అయిదో దిక్కొకటున్నది పైన
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం

భవమాన్యాసుతం భక్తజననుతం
శ్రీరామ ధూతం మారుతిం
నమతు రాక్షసాంతకం
వాయుపుత్రం వాలగాత్రం
వజ్రకాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం
దీప్రదాయం ఆంజనేయం
వాయువుతోనే ఆయువు ఆరంభం
వాయువుతోనే ఆయువు అంతం
నడుమన గడిచేదే నరుని జీవితం
అది శ్వాసల లెక్కలు
మూసిన వెంటనే సమాప్తం
చిరు చిరు చిరు చిరు చిరుగాలై
నీకూపిరి పోసిన చేతితో
సుడి సుడి సుడి సుడి సుడిగాలై
ఆ ఊపిరి తీస్తది కాచుకో
గాలిలో కలిసిపో గాలిలో కలిసిపో
వాయుపుత్రం వాలగాత్రం
వజ్రకాయం ఆంజనేయం
వానరేంద్రం ధీరసాంద్రం
దీప్రదాయం ఆంజనేయం
ఝంఝా మారుత గమనం
పాదద్వయ చలనం
వింధ్యా మేరు ప్రకంపనం
విధ్వంసాన్విత రచనం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
తధ్యం శత్రు మరణం
తధ్యం శత్రు మరణం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
ఓం అగ్నిర్వా అపామాయతనం
ఆహొవా అగ్నేరాయతనం
అగ్ని నీళ్ళే పురోహితం
యజ్ఞశ్చ దేవ మృత్విజం
ఓ తారం రత్న ధాతావం
అగ్ని దేవం నమామ్యహం
అగ్ని దేవం నమామ్యహం
అగ్ని దేవం నమామ్యహం నమామ్యహం
అమ్మ ఒడిలోన వెచ్చదనం
అగ్ని ప్రేమకది చిహ్నం
అయ్య కళ్ళలో కాంతి కణం
అగ్ని కరుణకది చిహ్నం
ప్రేమ కరుణని దూరం చేసిన ధూర్తునిపై
ధూర్జటి ఫాల నేత్రజ్వాల
విరుచుకుపడదా తక్షణం
చిటపట చిటపట చలిమంటే
చిరచిర చిరచిర చితిమంటై
భగభగ భగభగ భగభగమని నిను
భస్మం చేయును కాచుకో
మంటలో కలిసిపో మంటలో కలిసిపో
కాలభైరవం కాశీ క్షేత్ర పాలకం ప్రభుమ్
కైలాసేష కేశయం విభుమ్
రుద్రం త్రికాల రుద్రం
త్రిలోక రుద్రం భయంకరం
వీరాగ్రహ ధృగ్వీక్షణం
విధ్యుత్ గ్రహ విస్ఫోటనం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
తధ్యం శత్రు మరణం
తధ్యం శత్రు మరణం
నాలుగు దిక్కుల మధ్యన
నలుగురి కన్నులు కప్పినా
అయిదో దిక్కొకటున్నది పైనా
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
తత్ర గంగవతి పృథివి
నిత్య సహనవతి పృథివి
స్వచ్ఛ ప్రేమవతి పృథివి
స్థైర్య శక్తిమతి పృథివి
వందేహం పృథ్వి మాతరం
బుడి బుడి అడుగుతో మొదలై
ఎన్నడుగులేసినా
భూమిలో ఆరడుగులేరా శాశ్వతం
మణులను గనులను వలచి
ఎంతెంత తవ్వినా
మన్నులో కలిపేందుకే నువ్వంకితం
దేనికోసం ఆరాటం మరి దేనికోసమీ అరాచకం
నిన్ను మోసే నేలతోనే
ఆడకెప్పుడూ పరాచకం
జననిగా తనయుని లాలించే
ఆ వెచ్చటి మెత్తటి చేతితో
గడగడ గడగడ లాడించే
భూకంపం తెస్తది కాసుకో
మట్టిలో కలిసిపో మట్టిలో కలిసిపో
వందేహం పృథ్వి మాతరం
వంచిత పీడిత యుద్ధ క్షేత్రం
దుర్జన భంజన మారణాస్త్రం
మౌనం సమర శంఖం
కర్తవ్యం ఖననం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
తధ్యం శత్రు మరణం
తధ్యం శత్రు మరణం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం

గంగేచ యమునేచైవౌ గోదావరీ సరస్వతిమ్
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
జలేస్మిన్ సన్నిధిం కురు
దాహం తీర్చే నీరే ప్రాణం తీసే ఏరై
ముంచుకు వస్తే ఎవ్వరాపగలరు
చినుకంతే అయినా మనసున్నోడి కన్నీరు
సృష్టిస్తోందదిగో సుడిగుండాల మున్నేరు
జలజల జలజల జలన్ జలన్ జల
జలజల జలజల జలన్ జలన్ జల జలవిలయం
పెళపెళ పెళపెళ పెళన్ పెళన్ పెళ
పెళపెళ పెళపెళ పెళన్ పెళన్ పెళ పెనుప్రళయం
చుట్టుముట్టి నిను తుదముట్టిస్తది కాచుకో
గంగలో కలిసిపో
తధీంతధీంత తకిట ధీంతనం
తరంగ లాస్య జలధి నర్తనం
తోంతధీంధీంత తోంతతజ్జణం
అంబుధీ కంఠ సింహ ఘర్జనం
తధీంతోం తకిట తోంతనం
అవశ్యం ధనుజ మర్దనం
సాక్ష్యం విశాల గగనం
సాక్ష్యం విశాల గగనం
తధ్యం శత్రు మరణం
తధ్యం శత్రు మరణం
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం
నాలుగు దిక్కుల మధ్యన
నలుగురి కన్నులు కప్పినా
అయిదో దిక్కొకటున్నది పైన
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
పంచభూతాల సాక్షిగా
పంచభూతేషు సాక్షిగా
పాఠం చెబుతది పాపం పండిన రోజున
శివం శివం భవ హరం హరం
శివం శివం భవ హరం హరం



Credits
Writer(s): Ananth Sriram, Harshavardhan Rameshwar
Lyrics powered by www.musixmatch.com

Link