Bahusha Ninu

బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా
నీ ఒంపులో నా కొంపలే
నేనెప్పుడో వేశానులే
జళ్ళో పువ్వు, ఒళ్ళో నువ్వు, మళ్ళీ నవ్వేదింకెన్నడు

బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా
కవ్వింపుతో నా సొంపులే
కైపెక్కగా కరిగానులే
ఆకు వక్కా దిండు పక్క చెమ్మచెక్క ఇంకెన్నడు

అటో అందము
ఇటో అందము
అసలే అందమంటూండగా
ఒకే పరువము
చెరో పక్కనా
ఇక నీ సొంతమౌతుండగా
ఊసులాడి ఊరించుకో
ఊపు మీద కవ్వించుకో
రాత్రి పగలే రప్పించుకో
రాసలీలే ఆడించుకో
ఆ మాటిచ్చి ఓమాటోచ్చి
ఈమాటిచ్చే రుచులందుకో

బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా

పొదచాటుగా పొరపాటుగా
బులపాటాలు పండించగా
చెలి పైటలో చలి పాటలే
యమతాళాలు వాయించగా
పూలు పెట్టి పండందుకో
పైట లాగి పాలించుకో
రెచ్చకొట్టి రేయుండిపో
చిచ్చుపెట్టే సిగ్గంటుకో
ఒకటే పిచ్చి
నీలో హెచ్చి
గిల్లిగిచ్చి లాలించుకో

బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా
నీ ఒంపులో నా కొంపలే
నేనెప్పుడో వేశానులే
ఆకు వక్కా దిండు పక్క
చెమ్మచెక్క ఇంకెన్నడు



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, S R Koteswara Rao, T. V. Somaraju
Lyrics powered by www.musixmatch.com

Link