Idedo Golaga

ఇదేదో గోలగా ఉంది
యదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే
ఇదేదో గోలగా ఉంది
నీ మీదే గాళి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే

ఒంటిగా పండుకోనీదు
కంటికే మత్తు రానీదు
అదే ధ్యాస అదే ఆశ నేనాగేదెట్టాగా
పువ్వులే పెట్టుకోనీదు
బువ్వనే ముట్టుకోనీదు
అదేం పాడో ఇదేం గోడో, నే వేగేదెట్టాగా
ఊరికే తహతహమంటాది
ఊపిరే చలిచలిగుంటాది
అదేం సెగలో ఇదేం పొగలో
అదేలే ఈడంటే

ఇదేదో గోలగా ఉంది
ఎదంతా వేడిగా ఉంది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే

బుగ్గకే సిగ్గు రాదాయే
మనసుకే బుద్ధి లేదాయే
అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగా
చెప్పినా ఊరుకోదాయే
వాయిదా వెయ్యనీదాయే
అదేం కిలకో అదేం పులకో నే బతికేదెట్టాగా
రెప్పలో రెపరెపగుంటాది
రేతిరే కాల్చుకు తింటాది
అవేం కలలో అవేం కథలో
అదేలే ప్రేమంటే

ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాళి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే



Credits
Writer(s): Veturi Murthy, Chakravarthy K
Lyrics powered by www.musixmatch.com

Link