Baba Sai Baba

బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది
అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా

నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే మరణించావంటే ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం శిధిలంగా అవుతుందా
పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది
అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా

దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ
రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేయనీ
నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్ను ఐక్యం అయిపొనీ... పోనీ

Credits
Writer(s): Veturi, Madavapeddi Suresh
Lyrics powered by www.musixmatch.com

Link