Pulla Mantimi

పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా

ఎల్లా కాలం నీదే చెల్లుతుందనుకొని
కల్లా కపటం లేని పల్లె జనులకు
నువ్వు ముల్లువోలె నిలిచినావురా
దిన దినము మమ్ము
నన్నులోలె నలిపినావురా
మా ఆడపడుచునా
గొల్లుమనగా చెరిచినావురా
ఓరి దొరల కొడుకా
తుళ్లి తుళ్లి నవ్వినవు గదరా
అరె దొంగ కొడుకా
అరె కళ్లలో కామమ్ముతో
ప్రతి పిల్ల పిల్లకు కన్నువేసిన
కళ్లు రెండు పెరిగి
ముప్పై పళ్ళు చెప్పుతో రాలగొడతాం
హా

అరె పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా

ఎక్కడివి నీ పొలములు
పటేల్ కొడుకా
ఎక్కడివి నీ చెలుకలు
భూస్వామి కొడుకా
ఒక్క రోజూ కూడా ఒక్క నిమిషం సేపు
దుక్కి దున్నలేని దున్నపోతువు నీకు
దిక్కు తెలియని భూములెక్కడివి
మా వెట్టిలేక
చెక్కు చెదరని మేడలెక్కడివి
మా కండ కల్వగ
లెక్కలేని గరిసెలెక్కడివి
మా నెత్తురోడగ
చక్కని పన్నీరులెక్కడివి
మా చెమట రాలగ
అరె చిక్కినవు ఇప్పటికి నువ్వు
ఇక్కడ ఇయ్యాల నిన్ను
తొక్కిపట్టి తోలు చెక్కి
టక్కున తల పగలగొడ్తా రా

పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా

వెట్టి పశులామంటివిరో
మా అన్న లాలో
ఎట్టి బాధలు పెడితివిరో
మా అక్కలలో
వెట్టిచాకిరి చెయ్యలేక
పుట్టినట్టి ఊరు విడిచి
పట్టణాలకు పారిపోతే పిట్టలోలె పట్టుకొచ్చి
కట్టినావు కళ్లు చేతులురా
కారాలు జల్లి
కొట్టితే కొరడాలు తెగినాయి రా
మా గంజి పోతే
కట్టి ఉచ్చ తాపినవు గదర
నిన్ను కొట్టడానికి
కట్టెలు ఎన్నైనా సాలవురా
నిన్ను చంపడానికి
అరె నిట్ట నిలువునా నరికి
నేడు చుట్టుపట్టు ఊళ్లలో
నీ పొట్ట పేగులు బలిని జల్లే
చిర్త పులులం వచ్చినామురా

అరె పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
ఒరె ఒరే పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా
పుల్లల మంటివి కదరా
ఇదిగో పులి పిల్లలై వచ్చినాము రా
పట్వారి కొడుకా



Credits
Writer(s): Vandemataram Srinivas, Suddhala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link