Andamanani Premarani

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే... ఊహూ భూమికే భూపాలమే
వయసుల సంగీతమే... ఊహూ భూమికే భూపాలమే

సనిస సరిగరి సనిసనిసని సనిస సగమమపమగారిస
సనిస సరిగరిని సనిపనిసనిస సగామమమ మప మగరిస

అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చిరాతలైన కవితలౌనులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే
ఎంగిలైన అమృతమ్ములే
గుండు మల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయి అర్ధరూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు

అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే... ఊహూ భూమికే భూపాలమే
వయసుల సంగీతమే... ఊహూ భూమికే భూపాలమే

ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే
రాహు కాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే
ప్రేమ బంధం ఎన్నడు వీడిపోదే
ఇది నమ్మరానిది కానేకాదే
ఈ సత్యం ఊరికి తెలియలేదే
ఆకశం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే
ప్రేమ తప్పు మాటని ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా



Credits
Writer(s): A R Rahman, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link