Priyathama

త తత తత తత త
తరర త తత తత తత త
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తర తత తర తత త
తతత తర తత తత త అహహా

రేగే రాగాలన్ని నాలో
ఉయ్యాలూగెలే హాయ్
మళ్లీ మళ్లీ నన్ను
మత్తెక్కిస్తున్నాయిలే హాయ్

హో రేగే రాగాలన్ని నాలో
ఉయ్యాలూగెలే హాయ్
మళ్లీ మళ్లీ నన్ను
మత్తెక్కిస్తున్నాయిలే హాయ్

నాలోన లీలగా నాగ స్వరాలుగా
పూసింది లాలస పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో
రేరాణి వెన్నెల్లలో
ఈ మోహమెందాక పోతున్నదో
ఈ దేహమింకేమి కానున్నదో
వలపులే పిలువగా

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తర తత తత తత త
తరర తత తత తత త అహహా

పూలే తేనై పోయి
నాలో వాగై పొంగెలే హోయ్
నిన్నే నిన్నే కోరి
నాట్యాలనే చేసెనే హోయ్

హో పూలే తేనైపోయి
నాలో వాగై పొంగెలే హోయ్
ఏయ్ నిన్నే నిన్నే కోరి
నాట్యాలనే చేసెనే హోయ్

నా పాన్పు పంచుకో
ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ ఈ రాతిరి
తేనెల్లు పొంగాలి చీకట్లలో
కమ్మన్ని కౌగిళ్లలో
నీ తోడు కావాలి ఈ జన్మకి
నే నీడనవుతాను నీ దివ్వెకి
పెదవులో మధువులా

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తతతతరతరత్త తతరరతరతరత్త

అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
త తత తత తత త
తరర త తత తత త



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link