Gopilola

గోపీలోల నీ పాల పడ్డమురా
లీలాలొల అల్లాడుతున్నామురా
చన్నీళ్ళులో వున్నామురా చిన్నారులం మన్నించరా
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి చెయ్యేత్తి మొక్కలమ్మా
అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు
గోపీలోల నీ పాల పడ్డమురా

కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా
మచ్చ మచ్చ మచ్చ మచ్చ
కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా
మచ్చ మచ్చ మచ్చ మచ్చ

జాలిమాలిన ఈగాలి తేరిపార చూసి చిందేసే ఇలా
మావిమాటున దాగుంటే కూతవేసి గువ్వలు నవ్వే గోలా
తరుణిలో కరుణతో మోక్షంచూపే కిరణమై నిలిచానే
తనువులో పుట్టేమాయను తెలుపగా పిలిచానే
మోక్షం కన్న మానం మిన్న
మిన్న...
గోపీలోల నీ పాల పడ్డమురా
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
చన్నీరులో వున్నామురా చిన్నారులం మన్నించరా
గోపీలోల నీ పాల పడ్డమురా

వాడిపోని సిరులెన్నో పూలుపూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ
నేనుకోరే ఆ తార ఏది మీలోన భామా భామా భామా
తగదురా ఇది మరి చోద్యంకాదా
సొగసరి గోవిందా అందరు నీవారేగా ఒకరితో ముడివుందా
చూసే కలలు ఎన్నో ఉన్నా
చూపే హృదయం ఒకటే ఉందమ్మా
గోపీలోల నీ పాల పడ్డమురా
లీలాలొల అల్లాడుతున్నామురా
అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మాలు
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి చెయ్యేత్తి మొక్కలమ్మా



Credits
Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link