Bhama

భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా
మావా నీ పప్పులు ఉడకవు ఆపరా గోల
వద్దంటే వయసొచ్చి
వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చెయ్ ఈ వేళ
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా

తప్పంటూ చెయ్యకపోతే తగలాటము
నిప్పంటి వయసులతోన చెలగాటము
అయితే మరి ఎందుకు చెప్పు మోమాటము
ఆడదాని మోమాటాలే ఆరాటము
వానాకాలం ముసిరేస్తుంటే వాటేసుకునే హక్కే ఉంది
ఇది వానో గాలో పొంగో వరదో రారా
మలిపొద్దులు పుచ్చక సుద్దులతో ఈ వేళ
మావా నీ పప్పులు ఉడకవు ఆపరా గోల
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా

ఏ దిక్కూ లేని చోటే ఏకాంతము
నా దిక్కూ మొక్కూ నువ్వే సాయంత్రము
ఇప్పట్లో వద్దూ మనకు వేదాంతము
సిగ్గంటూ బుగ్గివ్వడమే సిద్దాంతము
కవ్వింతల్లో కసిగా ఉంటే కౌగిలి కన్నా దారేముంది
అది రైటో కాదో, నైటో పగలో రావే
చెలి ఆకలి తీర్చకు చూపులతో ఈ వేళ
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా
మావా నీ పప్పులు ఉడకవు ఆపరా గోల
వద్దంటే వయసొచ్చి
వద్దన్నా మనసిచ్చి
నిద్దరకే సెలవిచ్చెయ్ ఈ వేళ
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా
మావా నీ పప్పులు ఉడకవు ఆపరా గోల



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link